భారీగా కరోనా టెస్టులు నిర్వహిస్తాం : మంత్రి ఈటల

భారీగా కరోనా టెస్టులు నిర్వహిస్తాం : మంత్రి ఈటల

తెలంగాణలో భారీగా కరోనా టెస్టులు నిర్వహిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పెద్ద మొత్తంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ, చాలా శాంపిళ్లు పెండింగ్‌లో ఉండటంవల్ల రెండు రోజులు నిలిపివేశామని తెలిపారు.

ఇప్పుడు మరింత పెద్దసంఖ్యలో కరోనా టెస్టులు చేస్తామని వెల్లడించారు. పాజిటివ్‌ ఉన్నవారికి ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం.. హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తామని వివరించారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి హాస్పిటల్ లో సేవలందుతాయన్నారు. వీరి ఆరోగ్య వివరాలను వైద్యసిబ్బంది ఎప్పటికప్పడు తెలుసుకుంటూ సూచనలు చేస్తుంటారని తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఉన్న చోట కంటైన్మెంట్‌ జోన్లు పెడుతామని చెప్పారు. లాక్‌డౌన్‌ విధింపుపై క్యాబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story