ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం: కేజ్రీవాల్

ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం: కేజ్రీవాల్
X

తొలి ప్లాస్మా బ్యాంక్ ను ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేజ్రీవాల్ అన్నారు. లివర్ అండ్ బైలియరీ సైన్సెన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారని.. డాక్టర్ల సిఫారసు మేరకు పాస్మా అందిస్తామని అన్నారు. దేశంలో ప్లాస్మా థెరపీ మొదటిగా ఢిల్లీలో నిర్వహించామని.. ఇప్పుడు ప్లాస్మా బ్యాంక్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా 29 మందికి చికిత్స అందించామని.. మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. కరోనా సోకిన వారిలో ఎక్కువగా శ్వాస తీసుకునే లక్షణం ఉండి.. ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోతాయని అన్నారు. ప్లాస్మా థెరపీ ద్వార చికిత్స అందిస్తే.. వేగంగా శ్వాస తీసుకోవడం తగ్గి.. ఆక్సిజన్ లెవెల్స్ మెరుగు పడతాయని ఆయన తెలిపారు. కరోనా వచ్చి.. నయమైన వారి నుంచి ప్లాస్మా తీసుకొని కరోనా బాధితులకు శరీరంలోకి పంపిస్తే.. వారిలో ఉండే యాంటీ బాడీస్ వలన రోగి కోలుకుంటాడని కేజ్రీవాల్ తెలిపారు.

Tags

Next Story