భారత్- చైనా సైన్యాధికారుల మధ్య ప్యాంగాంగ్ విషయంలో కుదరని ఏకాభిప్రాయం

భారత్- చైనా సైన్యాధికారుల మధ్య ప్యాంగాంగ్ విషయంలో కుదరని ఏకాభిప్రాయం

వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన ఉద్రిక్తతల నేపధ్యంలో భారత్, చైనా సైన్యాధికారులు చర్చలు జరిపారు. ఇప్పటి వరకూ మొత్తం మూడు సార్లు చర్చలు జరిగాయి. గాల్వానా ఘటనకు ముందు జూన్ 6న, గాల్వానా ఘటన తరువాత 22న జరిగాయి. తాజాగా మరోసారి జరిగాయి. అయితే, తాజాగా జరిగిన చర్చల్లో గాల్వానా లోయ విషయంలోని వివాదంపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ, ప్యాంగాంగ్ విషయంలో అభిప్రాయభేదాలు ఏర్పడినట్టు తెలుస్తుంది. చైనా యాప్స్ భారత్ నిషేధించిన తరువాత ఏర్పాటు చేసిన ఈ చర్చలు సుమారు 12 గంటల పాటు లడక్ చూసుల్ సెక్టార్‌లో జరిగాయి. అయితే, చైనా ఓవైపు శాంతి చర్చలకు ఆహ్వానిస్తూనే.. మరోవైపు ఎల్ఏసీ వెంట ఉద్రిక్త పరిస్థితులకు ఉసిగొల్పే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో భారత ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. పెద్ద ఎత్తున భారత జవాన్లు ఎల్‌ఏసీ వెంబడి మోహరించారు. చైనా కదలికలుపై పూర్తి నిఘా పెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story