తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 945 కేసులు

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 945 కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి సుమారు వెయ్యి కేసులు నమోదవ్వటంతో ప్రజల్లో రోజురోజుకు భయాందోళనలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 945 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు, ఏడుగురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో బాధితుల సంఖ్య 16,339కి చేరింది. ఇందులో 7,294 మంది డిశ్చార్జ్‌ అవ్వగా.. 8,785 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 260 మంది మృతి చెందారు. మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీలోనే 12,682 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story