చైనాపై కోపం కట్టలు తెంచుకుంటుంది: ట్రంప్

చైనాపై కోపం కట్టలు తెంచుకుంటుంది: ట్రంప్

అమెరికాలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గటం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు మరోసారి ట్విటర్ వేదికగా చైనాపై ద్వజమెత్తారు. ఈ అంటువ్యాధిని నియంత్రించే స్థితిలో తాము లేమని చైనా ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి హెచ్చరించారు. దీంతో.. అమెరికాలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న తీరును చూస్తే.. చైనాపై కోపం కట్టలు తెంచుకుంటుందని ట్రంప్ ట్వీటర్ లో మండిపడ్డారు. ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితికి కారణం బీజింగ్ అని ఆరోపించారు. అమెరికాలో్ కరోనా వ్యాప్తి గురించి అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచి మాట్లాడుతూ దేశంలో కరోనాను అరికట్టే పరిస్తితిలో అమెరికా ఆరోగ్యశాఖ లేదని అన్నారు. ఈ అంటువ్యాధిని నివారించకపోతే.. ఒక్కరోజలో మిలియన్ కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story