దేశంలో 6 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో 6 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
X

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాణాంతకర వైరస్ ని నివారించడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించి వంద రోజులు పూర్తయ్యింది. ఇప్పుడు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఆరు లక్షల మార్కును దాటాయి.

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,148 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 6,04,641కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 17834కు పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడినవారిలో 3,59,860 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2,26,947 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story