భారతదేశాన్ని చైనా సరిగా అంచనా వేయలేకపోయింది: అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్

భారతదేశాన్ని చైనా సరిగా అంచనా వేయలేకపోయింది: అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్
X

భారత ప్రభుత్వం చైనా యాప్స్ నిషేధించడంపై అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఎడ్వర్డ్ లుట్వాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోయిందని ట్వీట్ చేశారు. గాల్వాన్ లోయ ఘటన తరువాత చైనా వస్తువులును, యాప్స్ ను భారత్ నిషేధిస్తుందంటే.. చైనా నేతల ఎగతాలి చేశారని గుర్తు చేశారు. భారత్ పేద దేశమని.. ఈ దేశానికి ఎవరూ మద్దతివ్వలేరని.. భారత్ తమను ఏం చేయలేరనే విధంగా డ్రాగన్ కంట్రీ వ్యవహరించిందని అన్నారు. అయితే, భారత్ లో బాగా పాపులర్ అయిన టిక్ టాక్ సహా పలు యాప్స్ ను బ్యాన్ చేయడంతో.. ఇప్పుడిప్పుడే చైనాకు భారత్ బలం అర్థం అవుతోందని ఎడ్వర్డ్ లుట్వాక్ ట్వీట్ చేశారు. తాజాగా భారత్ తీసుకున్న నిర్ణయంతో టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ సుమారు 6 బిలియన్ డాలర్లు నష్ట పోయిందని అన్నారు. మొత్తం 59 యాప్స్ వలన మరింత నష్టం ఉంటుందని తెలిపారు. కాగా.. గాల్వాన్ ఘటనలో భారత్ సైనికులు 21 మంద చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం చైనా యాప్స్ నిషేధించిన విషయం తెలిసిందే.

Tags

Next Story