హైదరాబాద్‌లో గుబులు పుట్టిస్తున్న కరోనా కేసులు.. ఒక్కరోజులో 1000

హైదరాబాద్‌లో గుబులు పుట్టిస్తున్న కరోనా కేసులు.. ఒక్కరోజులో 1000

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఒక్కరోజులోనే 1213 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే, జీహెచ్ఎంసీలో ప్రతీరోజు నమోదవుతున్న కేసులు గుబులుపుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 998 కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసులసంఖ్య 18,570కి చేరింది. మొత్తం కేసుల్లో 9069 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 9226మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24గంటల్లో 8 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 275కి చేరింది.

Tags

Read MoreRead Less
Next Story