భారత్‌ లో భారీగా పెరగనున్న యుద్ధవిమానాలు

భారత్‌ లో భారీగా పెరగనున్న యుద్ధవిమానాలు
X

భారత్ చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ యుద్ద విమానాల ఆదునీకరణకు, మరికొన్ని విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 21 మిగ్‌-29 యుద్ధ విమానాలు, 59 ఎంఐజీ-29 విమానాల ఆధునీకరణకు డీఏసీ సిద్ధమైంది. అటు, 12 ఎస్‌యూ-30 ఎంకేఐల కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎంఐజీ 29 యుద్దవిమానాల కొనుగోలుకు, ఆధునీకరణకు 7400 కోట్లు కేటాచించగా.. 10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్ యుద్ధవిమానాలు కూడా కొనుగోలు చేయనుంది. గత కొన్నాళ్ల నుంచి యుద్ధ విమానాల కొనుగోలుకు, ఆధునీకరణకు వాయుసేన ప్రయత్నిస్తుంది. అయితే, ఎట్టకేలకు దీనికి డీఏసీ పచ్చజెండా ఊపింది.

Tags

Next Story