ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం.. 1.1 కోట్లు దాటిన పాజిటివ్ కేసులు

X
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రెండు లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,11,91,681 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా 5,29,127 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాంతకర వైరస్ నుంచి కోలుకుని 63,30,671 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అత్యధిక కరోనా కేసుల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. అమెరికాలో శుక్రవారం ఒక్కరోజే 57,683 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం 28,90,588 మంది కరోనా బారినపడ్డారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 728 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
