కరోనాతో ఒక్కరోజే 442 మంది మృతి

కరోనాతో ఒక్కరోజే 442 మంది మృతి
X

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,771 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 442 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6,25,544 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. . కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 18,655 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా 2,35,433 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 3,94,227 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు దేశంలో కరోనా రికవరీ రేటు 60 శాతానికి చేరింది.

Tags

Next Story