కరోనాతో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ కుటుంబానికి సీఎం కోటి రూపాయల చెక్కు..

విధినిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ కుటుంబాన్ని దిల్లీ సీఎం పరామర్శించి కోటి రూపాయల చెక్కును అందజేశారు. స్థానిక ఎల్ఎన్ జేపీ హాస్పిటల్ లో డాక్టర్ అసీం కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ గా పనిచేసేవారు. విధి నిర్వహణలో ఉండగా ఆయనకు కొవిడ్ సోకింది. జూన్ 6న కొవిడ్ లక్షణాలతో ఉన్న ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో డాక్టర్ ని క్వారంటైన్ కు తరలించారు. అయితే లక్షణాలు తీవ్రమవడంతో జూన్ 7న ఎల్ఎన్ జేపీ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స చేశారు. అయితే డాక్టర్ గుప్తా తనను సాకేత్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించమని కోరారు. దాంతో ఆయనను అక్కడకు షిప్ట్ చేశారు. అయినా ప్రాణాలు దక్కలేదు. వ్యాధితో పోరాడుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయారని ఎల్ఎన్ జేపీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com