రెమ్డిసివిర్ వాడకానికి సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు

రెమ్డిసివిర్ వాడకానికి సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు
X

కరోనా చికిత్సలో వినియోగిస్తున్న రెమ్డిసివిర్ వాడకం గురించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రోగికి వరుసగా ఐదురోజులు మెడిసిన్ ఇవ్వాలి. మొదటి రోజు 200 మిల్లీ గ్రాములు మెడిసిన్ ఇంజక్షన్ రూపంలో ఇవ్వాలి. తరువాత నాలుగు రోజులు 100 మల్లీగ్రాములు ఇవ్వాలి. ఈ మహమ్మారి లక్షణాలు మధ్యస్థ స్థాయిలో ఉన్నావారికి మాత్రమే వాడాలని జూన్ 13న కేంద్రం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కిడ్నీ సమస్యలున్న వారికి, గర్భిణులు, పసిపిల్లలున్న తల్లులు, 12 ఏళ్లు లోపు వయసున్న చిన్నారులకు మాత్రం ఈ మందు ఇవ్వకూడదని కూడా అప్పట్లో తెలిపింది.

Tags

Next Story