హైదరాబాద్‌లో కరోనా కలకలం.. ఒక్కరోజే సుమారు 1,600 కేసులు

హైదరాబాద్‌లో కరోనా కలకలం.. ఒక్కరోజే సుమారు 1,600 కేసులు

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్కరోజే 1,850 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 22,312 చేరింది. ఈరోజు నమోదైన 5 కరోనా మృతులతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 288కి చేరింది. ఇప్పటివరకూ 11,537 మంది డిశ్చార్జి అవ్వగా.. ఇంకా 10,487 మంది చికిత్స పొందుతున్నారు. ఈరోజు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిదిలోనే 1,572 కేసులు నమోదైయ్యాయి. భారీ సంఖ్యలో హైదరాబాద్ లో కరోనా కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story