కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న ఏర్పాట్లు

ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే, ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీంతో ఎన్నికల సయమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం ఎన్నికల సంఘం కొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకొని వస్తుంది. ఇప్పటికే 65 సంవత్సరాలు పైబడినవారు, న్యూమోనియాతో బాధపడుతున్న వారి కోసం పోస్టల్ బ్యాలెట్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, తాజాగా మరికొన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. ఈవిఎం బటన్ నొక్కే సమయంలో కరోనా వ్యాప్తికి అవకాశం ఉండటంతో.. చేతివేళ్లతో కాకుండా.. కర్రచెక్కలను ఉపయోగించాలని నిర్ణయించింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారి కోసం మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయనుంది. ఒక పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది కంటే ఎక్కువగా ఓట్లు వేయకూడదని నిర్ణయించిది. దీనికి తగ్గట్టు అదనంగా 45శాతం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com