ఈ ఏడాదిలో వ్యాక్సిన్ రాకపోవచ్చు: సీసీఎంబీ

కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఎప్పడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్లకి నిరాశ కలిగించే అంశం ఇది. ఆగస్ట్ 15కి వ్యాక్సిన్ వస్తుందని తుది దశ క్లినికల్ ట్రయిల్స్ లో ఉన్నామని భారత్ బయోటెక్ చెబుతోంది. కానీ ఈ ఏడాది వ్యాక్సిన్ రావడం కష్టం అంటున్నారు సీఎస్ఐఆర్-సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా. ఇదేమీ మందు బిళ్ల కాదు ఇచ్చి తగ్గిందా లేదా అని చూసేందుకు. భారీ స్థాయిలో క్లినికల్ ట్రయిల్స్ జరపాల్సి ఉంటుంది అని మిశ్రా అన్నారు. నిజానికి వ్యాక్సిన్ల అభివృద్ధికి చాలా ఏళ్లు పడుతుంది. మనుషులపై చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అయితే వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి రావొచ్చు, అంతకన్నా ముందైతే రాదని మిశ్రా అంటున్నారు. ప్రస్తుతం రోజుకు 400-500 కరోనా టెస్టులు చేస్తున్నామని అన్నారు. ఇంతకన్నా తక్కువ సమయంలో, తక్కువ మందితో ఎక్కువ టెస్టులు చేసే విధానాన్ని తాము ఐసీఎంఆర్ కు ప్రతిపాదించామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com