హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ వలన ఎలాంటి ప్రయోజనం లేదు: డబ్ల్యూహెచ్‌ఓ

హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ వలన ఎలాంటి ప్రయోజనం లేదు: డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా రోగులకు చికిత్సలో ఉపయోగిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ పై క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయనున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఈ మెడిసిన్ తో కరోనా పూర్తిగా నయం చేయడంలో విఫలమైందని తెలిపింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు లోపినవిర్‌, రిటోన‌విర్ ట్ర‌య‌ల్స్‌ను కూడా నిలిపివేస్తామని తెలిపింది. ఇప్పటివరకూ చేసిన ట్రయల్స్ లో ఈ మెడిసిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో కరో్నా మరణాలు తగ్గించడంలో ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది.

అయితే, ఈ మెడిసిన్ వలన కరోనా మరణాలు పెరిగాయి అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ఈ క్లినికల్ ట్రయిల్స్ నిలిపివేత నిర్ణయం ఇతర అధ్యాయనాలపై ప్రభావం చూపదని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story