కరోనా గుట్టు తేల్చేందుకు సిద్ధమైన డబ్ల్యూహెచ్ఓ

X
కరోనా మూలాలు ఏంటో తెలుసుకొని.. ఈ మహమ్మారి గుట్టురట్టు చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ సిద్ధమైంది. దీనికోసం డబ్ల్యూహెచ్ఓ బృందం వచ్చేవారం చైనా వెళ్లనుంది. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లోని పుట్టిందనే ఆరోపణలు ఉండటంతో డబ్ల్యూహెచ్ఓ ఈ పర్యటనకు సిద్ధమైంది. డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిన్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ మహమ్మారి పుట్టుకను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది ఎక్కడ మొదలైంది? ఎలా మొదలైంది? ఎలా వ్యాప్తి చెందుతుందని అంశాలు తెలుసుకోవాలని అన్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కనుక ఇది చాలా ముఖ్యమని అన్నారు. ఇవన్నీ తెలుసుకుంటే వైరస్ తో సమర్థవంతంగా పోరాడగలమని అన్నారు. ఈనేపథ్యంలో చైనాకు వచ్చేవారం డబ్ల్యూహెచ్ఓ వెళ్లనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
