ఉత్తరప్రదేశ్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

X
By - TV5 Telugu |6 July 2020 2:01 AM IST
ఉత్తరప్రదేశ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఘజియాబాద్ మోదీనగర్ బఖకా గ్రామంలోని ఓ కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలైయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పేలుడు పదార్థాలు ఉండటంతో కర్మాగార భవనం కూలిపోయిందని తెలుస్తుంది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ విచారం వ్యక్తం చేస్తామని అన్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com