దిగివచ్చిన చైనా.. రెండు కిలోమీటర్లు వెనక్కు

భారత్‌తో చేస్తున్న అస్టధిగ్బందనంతో చైనా బలగాలు వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. దీంతో గాల్వాన్, గోగ్రా నుంచి బలగాలు తిరుగుముఖం పట్టాయి. టెంట్లు తొలగించి.. వాహనాలు వెనక్కు తగ్గాయి. రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లాయి. కమాండర్ స్థాయి చర్చల్లో చైనా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జూన్ 15న గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో జరిగిన ఘటనలో 20 మంది భారత జవాన్లను మరణించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో చైనా యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించి.. చైనాను వాణిజ్యపరంగా దెబ్బతీసింది. అటు, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు చైనాను దోషిలా చూస్తున్నాయి. అటు, ప్రధాని మోదీ స్వయంగా లడక్‌లో పర్యటించి సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని పెంచారు. దీంతో చైనా దిగివచ్చినట్టు తెలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com