తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు

X
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. GHMC పరిధిలోనే 1419 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25733కి చేరింది. యాక్టివ్ కేసులు 10644 ఉన్నాయి.
సోమవారం 2078 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినుండి రాష్ట్ర వ్యాప్తంగా 14781 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి 306 మంది మృతి చెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
