అంతర్జాతీయం

పాక్‌లో కరోనా కలకలం.. మరో మంత్రికి సోకిన మహమ్మారి

పాక్‌లో కరోనా కలకలం.. మరో మంత్రికి సోకిన మహమ్మారి
X

పాకిస్తాన్ ఆరోగ్యశాఖ మంత్రి జాఫ‌ర్ మీర్జాకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేపించుకున్నాని అన్నారు. పరీక్షల్లో కరోనా పాటిజివ్ అని నిర్థారణ అయిందని.. వైద్యుల సలహా మేరకు తాను సెల్ప్ క్వారంటైన్ లో ఉంటున్నానని ట్వీట్ చేశారు. దీంతో పాకిస్తాన్ లో కరోనా సోకిన ప్రజాప్రతినిధుల జాబితాలో ఆయన కూడా చేరారు. ఇటీవల పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మ‌హ్మ‌ద్ ఖురేషికి కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కాగా.. నేష‌న‌ల్ అసెంబ్లీ స్పీక‌ర్ అస‌ద్ ఖైస‌ర్, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు షాహ‌బాజ్ ష‌రీఫ్, సింధ్ గ‌వ‌ర్న‌ర్ ఇమ్రాన్ ఇస్మాయిల్, పీపీపీ నాయ‌కుడు స‌యీద్ ఘ‌ని, రైల్వే మంత్రి షేక్ ర‌షీద్ కూడా క‌రోనా సోకింది.

Next Story

RELATED STORIES