కాలువలోకి దూసుకెళ్లిన కారు.. అద్దాలు పగులగొట్టి బయటకు..

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. అద్దాలు పగులగొట్టి బయటకు..
X

ఓ కారు కాలువలోకి వేగంగా దూసుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తులు అప్రమత్తమై అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఏపీలోని పాతహిరమండలంలో చోటుచేసుకుంది.

పాలకొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు కంచిలిలో పని ముగించుకొని అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. వీరు పాతపట్నం, హిరమండలం మీదుగా పాలకొండ చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. హిరమండలం వచ్చేసరికి ఉదయం నాలుగు గంటలైంది. పాత హిరమండలం దాటాక.. వంశధార కుడి ప్రధాన కాలువలోకి కారు వేగంగా దూసుకెళ్లింది. అప్పటికే కాలువలో పది అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. అయితే అద్దాలను పగులగొట్టి కారులో ఉన్న ఇద్దరూ ఎలాగోలా బయట పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story