దేశంలో 7 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు.. ఒక్కరోజే 467 మంది మృతి

దేశంలో 7 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు.. ఒక్కరోజే 467 మంది మృతి
X

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ సంఖ్య ఏడు లక్షలు దాటింది. తొలి లక్ష వైరస్‌ కేసులు నమోదు కావడానికి 110 రోజులు పడితే, తర్వాత 49 రోజుల్లో ఏడు లక్షల కేసులు రికార్డయ్యాయి.

సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకు కొత్తగా 22,252 మందికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరింది. తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి 467 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 20,160కు చేరింది. ఇప్పటి వరకు 4,39,947 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇంకా 2,59,557 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story