క‌రోనా కలకలం.. భార్య‌ను ఇంటికి రానివ్వ‌ని భ‌ర్త‌

క‌రోనా కలకలం.. భార్య‌ను ఇంటికి రానివ్వ‌ని భ‌ర్త‌
X

కరోనా ఈ పేరు వింటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కొందరిలో ఈ కరోనా భయం వెంటాడుతోంది. ఎవరైనా దగ్గినా.. తుమ్మినా చుట్టుపక్కల ఉన్నవారు ఉలిక్కిపడుతున్నారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో.. క‌రోనా కేసులు న‌మోదైన ప్రాంతాల‌కు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. కంటైన్ మెంట్ జోన్ల ప‌రిధిలో ఉన్న ప్ర‌జ‌ల‌ను వేరే ప్రాంతాల్లోకి అనుమ‌తించ‌డం లేదు. ఓ భ‌ర్త కూడా క‌రోనా భ‌యంతో త‌న భార్య‌ను ఇంటికి రానివ్వ‌లేదు. బెంగ‌ళూరులో జరిగిన చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది.

బెంగ‌ళూరుకు చెందిన ఓ మ‌హిళ‌.. మూడు నెల‌ల క్రితం చండీఘ‌ర్‌కు వెళ్లింది. అయితే లాక్ డౌన్ కార‌ణంగా ఆమె అక్క‌డే చిక్కుకుపోయింది. ఆమె భ‌ర్త‌, ప‌దేళ్ల కుమారుడు మాత్రం బెంగ‌ళూరులోనే ఉండిపోయారు. లాక్ డౌన్ సడలింపు ఇవ్వటంతో.. ఇటీవ‌లే ఆమె బెంగ‌ళూరుకు తిరిగొచ్చింది.

కానీ భ‌ర్త ఆమెను ఇంటికి రానివ్వ‌లేదు. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల‌ని సూచించాడు. కరోనా రిపోర్టు నెగిటివ్ వ‌స్తేనే ఇంట్లోకి అనుమ‌తిస్తాన‌ని భార్య‌కుతెగేసి చెప్పాడు భ‌ర్త. దీంతో చేసేదేమీ లేక‌.. బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు భ‌ర్త‌ను పిలిపించి.. ఇద్ద‌రికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. క‌రోనాపై వారికి అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌స్తుతం భర్తతో కలిసి ఆమె హోం క్వారంటైన్ లో ఉంది.

Tags

Next Story