గడిచిన 48 గంటల్లో 298 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

గడిచిన 48 గంటల్లో 298 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
X

మహారాష్ట్రలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 48 గంటల్లో రాష్ట్రంలోని 298 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడిన పోలీసుల సంఖ్య 5,713కు చేరింది. ప్రస్తుతం ఇందులో 1,113 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా బారినుండి 4,275 మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి 71మంది సిబ్బంది మృతిచెందారు.

కాగా, మహారాష్ట్రలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 2,17,121గా ఉంది. వీటిలో 89,313 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1,18,558 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 9,250 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story