అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలో భారత్‌కు చెందిన టీవీ నటిని బస్సులో నుంచి దింపేసిన డ్రైవర్

ఆస్ట్రేలియాలో భారత్‌కు చెందిన టీవీ నటిని బస్సులో నుంచి  దింపేసిన డ్రైవర్
X

జాతి వివక్షకు వ్యతిరేకంగా ఎన్ని నిరసన గళాలు వినిపించినా.. ప్రపంచంలో పలు దేశాల్లో ఈ వివక్షత రాజ్యమేలుతోంది. ఇటీవల ఆస్ట్రేలియాలో భారత్ కు చెందిన టీవి నటి చాందిని భ‌గ్వనాని వివక్షకు గురైంది. ఆమె తనకు ఎదురైన చేదు అనుభవం అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఆమె మెల్‌బోర్న్ నుంచి ఓ ప్రదేశానికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. ఆ బస్సు చాలా దూరం ప్రయాణించిన తరువాత.. తనకు అనుమానం వచ్చి.. ఈ బస్సు సరైన ప్రదేశానికే వెళ్తుందా అని బస్సు డ్రైవర్ అడిగిందని.. అయితే, తన ప్రశ్నకు డ్రైవర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆమె తెలిపింది. కాసేపటికి ఆ బస్సులో ఉన్నందరకీ.. అదే అనుమానం రావటంతో వారు కూడా అదే విధంగా ప్రశ్నించారు. అయితే, వారందరకి చాలా గౌరవంగా సమాధానమిచ్చడని చెప్పింది. దీంతో తాను మరోసారి డ్రైవర్ ను అడగ్గా.. ఆయన ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడని తెలిపింది. చెత్త భారతీయులారా.. ఇక్కడి నుంచి వెళ్లిపోండని బూతులు తిట్టాడని ఆమె చెప్పింది. దీంతో తనకు ఏం చేయాలో తెలియక.. భయపడుతూ.. బస్సు దిగిపోయానని ఆమె చెప్పింది. తనకు జరిగిన ఈ అనుభవమే.. జాతి వివక్ష ఇంకా ఉందనడానికి నిదర్శనం అని చాందిని భ‌గ్వనాని తెలపింది.

Next Story

RELATED STORIES