కరోనా పరిస్థితిపై ప్రధాని మోది సమీక్షా సమావేశం

కరోనా పరిస్థితిపై ప్రధాని మోది సమీక్షా సమావేశం
X

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృభిస్తుంది. ప్రతీరోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదుతున్నాయి. కరోనా పరిస్థితిపై ప్రధానిమోదీ నరేంద్ర మోదీ శనివారం సమీక్షించారు. ఈ సమావేశంలో ఢిల్లీలోని ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. స్థానిక ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తలను మోదీ అభినందించారు. ఎన్‌సీఆర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధానికి అనుసరించిన విధానాన్నే దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. వ్యక్తగత పరిశుభ్రతతో పాటు సామాజిక క్రమశిక్షణ పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, నీతి ఆయోగ్ సభ్యులు, క్యాబినెట్ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Tags

Next Story