తల్లికి కొవిడ్ వస్తే బిడ్డకి పాలు..

తల్లికి కొవిడ్ వస్తే బిడ్డకు పాలివ్వొచ్చని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇక తల్లి పాలు లేని చిన్నారులు కొవిడ్ వచ్చిన తల్లులు ఇచ్చిన పాలను కూడా 62.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల పాటు పాశ్చరైజ్ చేసి ఇవ్వొచ్చంటున్నారు కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన పరిశోధకుడు షరోన్ ఉంగెర్. ఈ పాలు చిన్నారులకు ఎంతో సురక్షితమైనవని ఆయన అంటున్నారు. అన్ని కెనడియన్ పాల బ్యాంకులలో పాలను పాశ్చరైజ్ చేసి చిన్నారులకు అందిస్తున్నారు. తల్లి పాల ద్వారా సంక్రమిస్తుందని తెలిసిన హెచ్ ఐవి, హెపటైటిస్ మరియు ఇతర వైరస్ లను తటస్థం చేయడంలో పాశ్చరైజేషన్ ప్రభావ వంతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 650 కి పైగా తల్లి పాల బ్యాంకులు పాలను నిల్వ చేసే పద్దతిని ఉపయోగించి బలహీన శిశువులకు పాలను సురక్షితంగా సరఫరా చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com