చైనా రైల్వే రంగంపై కరోనా ప్రభావం

X
కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుంది. రవాణా వ్యావస్థపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. నలుగురు ప్రయాణించాలన్నా.. ప్రజలు భయపడుతున్నారు. చైనా రైల్వే ప్రయాణికుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోయింది. 2020లో మొదటి అర్థ సంవత్సరంలో రైలు ప్రయాణికులు 53.9 శాతం క్షీణత నమోదైంది. చైనా స్టేట్ రైల్వే గ్రూప్ కంపెనీ లిమిటెడ్ తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా 2020వ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో 81.8 కోట్ల రైల్వే ప్యాసింజర్ ట్రిప్స్ నమోదయ్యాయి. జూన్లో మొత్తం 16.6 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారు. మే నెలలో ప్రయాణికుల కన్నా జూన్లో 9.4 శాతం మంది ఎక్కువ. పరిశ్రమలు, కంపెనీల్లో ఉత్పత్తులు తిరిగి ప్రారంభమవడంతో రైల్వే ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
