తెలంగాణలో కొత్తగా 1178 కరోనా పాజిటివ్ కేసులు

X
తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్క హైదరాబాద్‌లోనే 736 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
కరోనా బారినుండి కోలుకుని ఒక్కరోజే 1,714 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే తొమ్మిది మంది మృతిచెందారు. తెలంగాణలో మొత్తం పాజిటవ్ కేసుల సంఖ్య 33,402కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 348కి పెరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి కొలుకొని 20,919 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 12,135 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
