హైదరాబాద్‌లో కరోనా మృతదేహాల తరలింపుకు ఉచిత అంబులెన్స్ సేవలు

హైదరాబాద్‌లో కరోనా మృతదేహాల తరలింపుకు ఉచిత అంబులెన్స్ సేవలు

హైదరాబాద్‌లో కరోనా మృతదేహాల తరలింపు కోసం కొంత మంది సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగులు ఉచిత అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు. దీని కోసం ముగ్గురు ఉద్యోగులను కూడా పెట్టారు. ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మాట్లాడుతూ.. మృదేహాల తరలింపుకోసం ప్రైవేట్ ఆస్పత్రులు 25 వేలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అయితే, డబ్బు ఉన్నవారు ఇస్తారు కానీ, లేని వారి పరిస్థితి ఏంటి అనే దానికి బదులుగా ఈ సర్వీస్ ప్రారంభించామని అన్నారు. ఈ సర్వీసులో తమకు కొంతమంది డొనేషన్స్ ఇస్తున్నారని అన్నారు. ఒకరు అంబులెన్స్ ఇచ్చారని.. మరికొంత మంది నగదు సాయం చేస్తున్నారని అన్నారు. ఎవరికైనా అంబులెన్స్ కావలసి వస్తే.. 8499843545 నెంబర్‌కు కాల్ చేయాలని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో తమ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story