నా ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజంలేదు: మహారాష్ట్ర గవర్నర్

నా ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజంలేదు: మహారాష్ట్ర గవర్నర్
X

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి సెల్స్ ఐసోలేసన్ లో ఉన్నట్టు ఈ రోజు పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఐసోలేషన్ లో లేనని.. అయితే, కరోనా పరీక్ష చేయించుకున్నానని.. నెగిటివ్ వచ్చిందని తేల్చి చెప్పారు. ప్రతీచోట కరోనా నిబంధనలు పాటిస్తున్నాని తెలిపారు. సామాజిక దూరం పాటించడం, శానిటైజింగ్, మాస్క్ ధరించడం వంటి ప్రోటోకాల్స్ పాటిస్తున్నానని అన్నారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లోనిజం లేదని అన్నారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు.

Tags

Next Story