91 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్

X
తిరుమలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 91మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకింది. అయితే భక్తులెవరికీ వైరస్ సోకలేదని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత ఇప్పటి వరకు 2.5లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు ఆయన తెలిపారు. జూలై 10 వరకు తిరుమలలో 1865, అలిపిరి వద్ద 1704 మంది టీటీడీ ఉద్యోగులకు, 631 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఆయన వివరించారు.
ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. భక్తుల అనుమతి, ఇతర ఏర్పాట్లు వంటి విషయాలపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయిస్తామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
