కరోనా అదుపులోకి వచ్చింది.. కారణం అదే..: కేజ్రీవాల్

ఢిల్లీలో కరోనా అదుపులోకి వస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకు తగ్గుతున్నాయని.. అయితే, నిర్లక్ష్యం మాత్రం వహించవద్దని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్లీ ఎప్పుడైనా కరోనా విరుచుకుపడ్డొచ్చని.. అందుకే అలసట వహించొద్దని అన్నారు. కరోనా కట్టడిలో ప్రజలు కూడా భాగం అవ్వలని.. ప్రభుత్వం ఒక్కటే ఎంత కృషి చేసినా.. ఫలితం మాత్రం పెద్దగా ఉండదని గుర్తించామని.. దీంతో ప్రజలందరినీ భాగస్వాములను చేశామని అన్నారు. అందరు కలిసికట్టుగా పనిచేయడం వలనే కరోనా అదుపులోకి వచ్చిందని.. హోం ఐసోలేషన్ కూడా కరోనా ను అదుపు చేయడానికి ఒక కారమైందని అన్నారు. ఇదే స్పూర్తితో మరింత కాలం పరిచేయాలని.. ఏమాత్రం ఏమరుపాటు వహించినా.. కరోనా విజృంభించే అవకాశం ఉందని కేజ్రీవాల్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com