పాక్లో 2.5 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

X
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజ వణికిస్తున్నది. ఇక పాకిస్థాన్లో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. పాకిస్థాన్ దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 2,769 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాకిస్థాన్లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,51,625కు చేరిందని ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. అలాగే అక్కడ కొత్తగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్థాన్లో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,266కు చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
