పెళ్లి వేడుకలకు 30 మందికి మాత్రమే అనుమతి!

దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. పంజాబ్‌లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్రవ్యాప్తంగా బహిరంగ సభలను పూర్తిగా నిషేధించింది. అలాగే సామూహిక కార్యక్రమాలకు ఐదుగురు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతినిచ్చింది. ఇక పెళ్లిళ్లకు 30 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతినిచ్చింది. గతంలో వివాహ వేడుకలకు 50 మంది వరకు అనుమతి ఉండేది. ఇప్పుడు దీనిని మరింత కఠినతరం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు.
సామాజిక కార్యక్రమాలను నిర్వహించే ముందు పోలీసులు, పరిపాలనా అధికారుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని సర్కార్ నిబంధనలు విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, లేదా జరమానా విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

