కాంగోలో కరోనాకు తోడైన ఎబోలా వైరస్

కాంగోలో కరోనాకు తోడైన ఎబోలా వైరస్

ప్రపంచ వ్యాప్తంగా వైరస్ స్వైరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు.. ఆఫ్రికాలో పలు దేశాల్లో ఎబోలా వ్యాప్తి చెందుతుంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాంగో దేశంలో.. సెంట్రల్ రిపబ్లికన్ సరిహద్దుల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర నిపుణుడు మైక్ ర్యాన్ తెలిపారు. ఇప్పటివరకూ 48 ఎబోలా కేసులు బయటపడ్డాయని..జూన్ 1 నుంచి ఈ వైరస్ బారిన పడి 20 మంది మృతి చెందారని అన్నారు. కాంగో నదీ తీర ప్రాంతంలో కరోనాకు ఎబోలా తోడైందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసింది. ఎబోలా వల్ల గత రెండేళ్లలో 2,277 మంది మరణించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ దీని నివారణకు చర్యలు తీసుకోవాలని కోరింది.

Tags

Read MoreRead Less
Next Story