సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

X
సీఎం జగన్‌కు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని.. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ.. 10లక్షల 66 వేల మంది పేర్లే ఆదార్‌తో లింక్ అయ్యాయని అన్నారు. మిగిలిన వారి పేర్లు కూడా లింక్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని.. అందరికి ఆర్దిక సాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వహయాంలో బిల్డ్రర్స్ నుంచి సంక్షేమ నిధి రూపంలో 13 వందల 64 కోట్లు వసూలు చేసిందని.. అయితే, ఇప్పటి వరకూ.. 330 కోట్లు మాత్రేమే.. ఖర్చు చేసిందని లేఖలో వివరించారు. మిగిలిన నిధులను ఈ కష్ట సమయంతో కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని రఘురామకృష్టం రాజు కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
