బీహార్ రాజ్‌భవన్‌లో 30 మందికి కరోనా

బీహార్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగతున్నాయి. దీంతో ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తుంది. అయినప్పటికీ రోజువారీ కేసుల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించడంలేదు. తాజాగా.. రాజ్‌భవన్‌లో 30 మందికి కరోనా సోకిందని ప్రభుత్వం ప్రకటించింది. అటు బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ కు కూడా కరోనా పాజిటివ్ సోకిందని అధికారులు తెలియజేశారు. కాగా.. ఇప్పటివరకూ బీహార్ లో మొత్తం 20,173 కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story