అన్నదమ్ములిద్దరూ ఆరుగురిని దారుణంగా.. చివరికి..

అన్నదమ్ములిద్దరూ ఆరుగురిని దారుణంగా.. చివరికి..
X

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మనేరి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ కుటుంబం కారులో బంధువుల ఇంటికి వెళుతున్నారు. అన్నదమ్ములు హరీష్ సోనీ, సంతోష్ సోనీ కారుని వెంబడించారు. పదునైన ఆయుధాలతో కారులో ఉన్న వారిని బెదిరించి విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశారు. అందులో ఉన్న ఇద్దరు చిన్నారులను సైతం మానవత్వం లేకుండా మట్టుపెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని వెంబడించారు. ఆగ్రహంతో ఊగిపోయి అన్నదమ్ముల్లో ఒకరిని చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మరో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతడు ఆయుధాలు, కారంపొడితో పోలీసులపై దాడికి పూనుకున్నాడు. పోలీసుల కాల్పుల్లో అతడు కూడా మరణించాడు. ఈ సంఘటనపై స్పందించిన మాజీ సిఎం కమల్ నాథ్ రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని విరుచుకుపడ్డారు.

Tags

Next Story