పాక్‌లో కరోనా ఉద్ధృతి.. రెండున్నర ల‌క్షలు దాటిన కేసులు

పాక్‌లో కరోనా ఉద్ధృతి.. రెండున్నర ల‌క్షలు దాటిన కేసులు
X

పాకిస్థాన్‌లో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. ఈ రోజు కొత్తగా 2,085మందకి కరోనా సోకిందని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తగ కేసులు 2,59,999కు చేరింది. కాగా..అటు, కొత్తగా 49 మంది కరోనాతో మృతి చెందింది. దీంతో కరోనా మరణాల సంఖ్య 5,475కు పెరిగింది. అయితే, కరోనా రికవరీ రేటు కూడా సంతృప్తికరంగా ఉండటం కాస్తా ఊరట కలిగిస్తున్న అంశంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు 1,83,737 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాకాపోతే.. 1,895 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో 16,76,090 కరోనా పరీక్షలు జరిగాయి.

Tags

Next Story