మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలుతుంది: ఫడ్నవీస్

మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలుతుంది: ఫడ్నవీస్
X

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహావికాస్ అగాఢీ కుప్పకూలుతుందని.. అది చూస్తామని అన్నారు. భేటీ అయ్యారు. కేంద్రహోం మంత్రి అమిత్ షా తో భేటీ అయిన దేవేంద్ర పడ్నవీస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ కోణం లేదని.. రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీలకు ఆర్థిక ప్యాకేజీ విషయం మాట్లాడడానికి కలిసానని అన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితిని అమిత్ షాకు వివరించానని అన్నారు. కరోనాపై పోరాడాల్సిన సమయంలో ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం తమకు లేదని అన్నారు. మహా వికాస్ అగాఢీలోనే కుమ్ములాటలు ఉన్నాయని.. ప్రభుత్వాన్ని వారే కూల్చుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story