రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్.. రానున్న రోజుల్లో..

రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్.. రానున్న రోజుల్లో..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉంది. కానీ రానున్న రోజుల్లో వ్యాప్తి ఉధృతమయ్యే అవకాశాలున్నాయని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ హెచ్చరించింది. పాపులేషన్ కౌన్సిల్ భారత విభాగం శాస్త్రవేత్తలు రూపొందించిన అధ్యయన నివేదికను లాన్సెట్ ప్రచురించింది. సామాజిక పరిస్థితులు, జనాభా, పరిసరాల పరిశుభ్రత, ఇన్షెక్షన్ల నియంత్రణ చర్యలు, ఆరోగ్యం పట్ల అప్రమత్తత అనే 5 విభాగాల్లోని 15 సూచికల ప్రాతిపదికగా వైరస్ ముప్పును అంచనా వేసినట్లు పాపులేషన్ కౌన్సిల్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ ఆచార్య తెలిపారు.

కరోనా పొంచి ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానం మధ్యప్రదేశ్ కాగా, రెండు బీహార్, మూడు తెలంగాణ నిలిచిందని నివేదికలో ప్రస్తావించారు. తరువాతి స్థానాలు వరుసగా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, గుజరాత్ ఉన్నాయి. ఇక తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలు సిక్కి, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో పరీక్షలు చేసి కేసులను గుర్తించే ప్రక్రియ జరగడం లేదని రాజీవ్ ఆచార్య పేర్కొన్నారు. అయితే ఈ గణాంకాలన్నీ ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి తీసుకున్నవని అన్నారు. ప్రస్తుతం ఆర్థిక స్థితి మెరుగుపడి ఉంటే ముప్పు తీవ్రతలో హెచ్చు తగ్గులు ఉండవచ్చని నివేదికలో స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story