మహారాష్ట్రలో 3 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో 3 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
X

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య మూడు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 8,348 కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబైలో రోగుల సంఖ్య లక్ష దాటింది. ముంబైలో ఇప్పటివరకు 1,00,350 మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 3,00,937 మంది కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇందులో 1,60,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడి 11,500 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story