అంతర్జాతీయం

ఇరాన్‌లో కరోనా విశ్వరూపం!

ఇరాన్‌లో కరోనా విశ్వరూపం!
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక ఇరాన్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. దేశంలో రెండున్నర కోట్ల మందికి కరోనా వైరస్‌ సోకి ఉండవవచ్చని ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ అన్నారు. కరోనా మహమ్మరి వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఆరోగ్య శాఖా చేసిన అధ్యాయనంలో ఊహించని సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయని అన్నారు. రాబోయే నెలలో ౩ కోట్ల మందికి కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని రౌహానీ అంచనా వేశారు. దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఇరాన్‌ రాజధాని టెహ్రన్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలు మొదలైయ్యాయి.

కాగా, ఇరాన్‌లో గడిచిన 24గంటల్లో 2,166 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 188 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,70,000కు చేరింది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు మొత్తం 13,973 మంది మృతి చెందారు.

Next Story

RELATED STORIES