ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షలు దాటిన కరోనా మృతుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షలు దాటిన కరోనా మృతుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు ఆరు లక్షలకుపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 2,17,257 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 14,424,525కు చేరింది.

కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 5008 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 6,04,880కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 86,11,976 మంది కోలుకున్నారు. మరో 52,07,669 మంది చికిత్స పొందుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ రికవరీల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మొత్తం మరణాల్లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నది. రోజువారి మరణాల్లో మాత్రం నాలుగో స్థానంలో ఉన్నది. భారత్‌కంటే ముందు బ్రెజిల్‌, అమెరికా, మెక్సికో దేశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story