ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ర్టంలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. తాజాగా ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తెనాలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ఆదివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

జలుబు రావటంతో ముందు జాగ్రత్తగా శనివారం కరోనా పరీక్ష చేయించుకున్నట్లు శివకుమార్ తెలిపారు. వారి కుటుంబంలో అందరికి పరీక్ష చేయగా.. ఆయనకు పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. 'చికిత్స తీసుకుంటున్నా.. నియోజకవర్గంలో ప్రజలు అధైర్యపడొద్దు సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా' అని ఎమ్మెల్యే శివకుమార్‌ తెలిపారు.

Tags

Next Story