ఒడిశాలో కరోనాను జయించిన క్యాన్సర్ రోగి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనాపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నారు. కరోనా సోకిన వృద్దులు, చిన్న పిల్లలు కోలుకోవడం కష్టం అనే ప్రచారం కూడా ఉంది. అయితే, ఒడిశాలో ఓ వృద్ధ దంపతులు ఈ ఆ ప్రచారానికి చెక్ పెట్టారు. కేంద్రపారా జిల్లాలో గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న సురేంద్ర పాల్ అనే 85ఏళ్ల వృద్దుడు కటక్ జూన్ 8న కటక్ లోని ఓ ప్రాంతీయ ఆస్పత్రిలో చేరారు. అతనికి తోడుగా.. తన భార్య సావిత్రి ఆస్పత్రిలో ఉంది. అయితే, అయితే, జూన్ 29న వారిద్దకి కరోనా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. దీంతో వారిద్దరిని కరోనా ఆస్ప్రత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ఇప్పుడు ఈ వృద్ద దంపతులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లా మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేస్తూ... వారు ఈ వ్యాధిని ఓడించడంలో చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. వారికి శుభాకాంక్షలు. అని రాశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com