కరోనా నుంచి కోలుకుంటున్న వారు ప్లాస్మా డొనేట్ చేయాలి: సీపీ సజ్జనార్

కరోనా నుంచి కోలుకుంటున్న వారు ప్లాస్మా డొనేట్ చేయాలి: సీపీ సజ్జనార్

కరోనా నుంచి కోలుకుంటున్న వారు ప్లాస్మా డొనేట్ చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ మహమ్మారి రోగనిరోదక శక్తిపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చందంగా ప్లాస్మా దానం చేయాలని.. దీంతో, ఇద్దరు కరోనా రోగులను కాపాడొచ్చని తెలిపారు. చాలా మంది పోలీసులు కరోనా నుంచి కోలుకుంటున్నారని.. అందులో చాలా మంది ప్లాస్మా దానం చేస్తున్నారిని తెలిపారు. కోలుకుంటున్న ప్రతీ ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని.. దీంతో మూడు కుటుంబాలను ఆదుకున్న వాళ్లం అవుతామని అన్నారు. ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్నవారు 9490617440 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్‌ సూచించారు

Tags

Read MoreRead Less
Next Story